న్యూఢిల్లీ ఫిబ్రవరి 8:- 2009-10 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయాభివృద్ధి రేటు 0.2 శాతం పడిపోవచ్చునని, దేశంలో కరువు, వరదల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని సెంట్రల్ స్టాటస్టికల్ ఆర్గనైజేషన్ ముందస్తు అంచనాల ద్వారా తెలుస్తున్నది. వ్యవసాయం, అటవీ రంగం, మత్స్య రంగం 0.2 శాతం పతనాన్ని సూచిస్తున్నాయని, గత సంవత్సరం ఈ రంగాలు 1.6 శాతం వృద్ధి సాధించాయని సిఎస్‌ఓ పేర్కొన్నది. రిజర్వుబ్యాంకు మూడో త్రైమాసికం సమీక్షలో జిడిపి వృద్ధి రేటు వ్యవ సాయరంగానికి సంబంధించి సున్నా శాతం ఉండవచ్చునని అంచనా వేసింది. ఆహార ధా న్యాల ఉత్పత్తి ఎనిమిది శాతం, నూనెగింజల ఉత్పత్తి ఐదు శాతం పడిపోవచ్చు.
అలాగే చెరకు ఉత్పత్తి 11.8 శాతం పడిపోవచ్చునని అంచనా వేసింది. అయితే పత్తి ఉత్పత్తి 0.2 శాతం, పండ్ల ఉత్పత్తి 2.5 శాతం, కూర గాయల ఉత్పత్తి 4.8 శాతం పెరగవచ్చు. జిడిపిలో వ్యవసాయరంగం వాటా ప్రస్తుతం 17 నుంచి 18 శాతం వరకు ఉన్నది. అయితే 60 శాతం పైగా ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. 1972 తర్వాత గత సంవత్సరంలో కాటక పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో దాదాపు సగ భాగంలో వర్షాలు సరిగా పడలేదు. దీనితో ఖరీఫ్ ధాన్యం దిగుబడి 13 మిలియన్ టన్నుల మేర పడిపోయింది.
వృద్ధి రేటు 7.2 శాతం 2009-10 సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు 6.7 శాతం ఉంటుందని రిజర్వుబ్యాంకు అంచనా వేస్తే సిఎస్‌ఓ అధికారికంగా ఈ వృద్ధి రేటు 7.2 శాతం ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగం 0.2 శాతం తగ్గిన ప్పటికీ ఉత్పత్తి రంగం 8.9 శాతం వృది ్ధసాధించవచ్చునని సిఎస్‌ఓ అంచనా వేస్తున్నది. దీనితో ప్రభుత్వం దశలవారీగా ఉద్దీపన ప్యాకే జీలను తొలగించవచ్చు. రెండో త్రైమాసికంలో రిజర్వుబ్యాంకు ఊహించినదానికంటే జిడిపి వృద్ధి రేటు 7.9 శాతం ఉన్నది.
దీనితో ప్రభు త్వం మొత్తం సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు 7.75 శాతం ఉంటుందని అంచనా వేస్తే రిజర్వుబ్యాంకు 7.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే ప్రస్తుతం సిఎస్‌ఓ ఈ వృద్ధి రేటు 7.2 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ స్థాయిలో వృద్ధి రేటు ఉండటం వల్ల ఉద్దీపన ప్యాకేజీ విజయవంతం అయిం దని చెప్పవచ్చునని, అందువల్ల దీనిని దశల వారీగా తొలగించవచ్చునని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మోంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ చావ్లా మాత్రం నేరుగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు.
బడ్జెట్ వరకు ఎదు రు చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం లభి స్తుందని అన్నారు. సెప్టెంబరునెలలో తాము వ్యవసాయాభివృద్ధి మైనస్ రెండు శాతం ఉం టుందని అంచనా వేసామని, అయితే ప్రస్తుతం సిఎస్‌ఓ మైనస్ 0.02 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నదని అహ్లు వాలియా పేర్కొన్నారు. ఆహార ధాన్యాల నిల్వ లు చాలినంతగా ఉన్నాయని, జనవరి ఒకటి నాటికి నిల్వలు గత సంవత్సరం కంటే ఎక్కు వగా ఉన్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చక్కెర కొరత ఉన్నదని, అందువల్లనే ధరలు పెరుగుతున్నాయని, పప్పుధాన్యాల దిగుమతి మీద ఆధారపడటం కొన్ని సమ్యలు ఉంటా యని చెప్పారు.కూరగాయలు ఆయా కాలంలో పండే పంటలని, ప్రస్తుతం బంగాళదుంపల ఇతర కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. సిఎస్‌ఓ గణాంకాలు వెల్లడి కాగానే స్టాక్ మార్కెట్ 200 పాయింట్లు పడిపోయిన చివరకు 100పాయింట్లకుపైగా పెరిగింది. 2004-05 ప్రాతిపదిక సంవత్స రంగా తీసుకొని ఈ ముందస్తు అంచనాలు వేసారు.
గతంలో 1999-2000 గణాంకాల ప్రాతిపదికగా ముందస్తు అంచనాలు వేసేవారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ జిడిపి 61,64,178 కోట్లుగా తేలింది. దీనితో ప్రస్తుతం ద్రవ్యలోటు జిడిపిలో 6.8 శాతం ఉంటే దానిని తక్కువగా చూపించడానికి బడ్జెట్‌లో ప్రభుత్వానికి అవస రం వస్తుంది. మాంద్య పరిస్థితుల నుంచి ఇండియా త్వరితంగా బయటపడిందన్న అభి ప్రాయం బలపడిందని, అయితే ఇప్పుడు గణా ంకాలు ఆ విషయాన్ని రూఢీగా నిరూపించా యని నిపుణులు చెబుతున్నారు. ముందస్తు అంచనాల ప్రకారం మైనింగ్ 8.7 శాతం, క్వారియింగ్ 1.6 శాతం ఈసంవత్సరం వృద్ధి సాధిస్తాయి.
అలాగే గ్యాస్, విద్యుత్, నీటి సరఫరా రంగాలు గత సంవత్సరం 3.9 శాతం వృద్ధి సాధిస్తే ఈ సంవత్సరం 8.2 శాతం వృద్ధి సాధిస్తాయి. వ్యాపారం, హోటళ్లు, రవాణా రంగం కూడా 7.6 శాతం నుంచి 8.3 శాతం వృద్ధి సాధించనున్నాయి. అలాగే నిర్మాణ రంగం 5.9 శాతం నుంచి 6.5 శాతం వరకు వృద్ధి సాధించనున్నది. అయితే ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ రంగాలు మాత్రం 10.1 శాతం నుంచి 9.9శాతానికి తగ్గనున్నాయి.