మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   10th 2010 - 4:26 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
పరేఖ్‌ సిఫారసులపై అభ్యంతరాలు
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:55 [IST]

businessన్యూఢిల్లీ ఫిబ్రవరి 8:- పెట్రోలియం ఉత్పత్తుల ధరల భారం వినియోగదారులపై మోపకుండా ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండా నివే దికను సమర్పించిన పరేఖ్‌ కమిటీ సిఫారసులపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కమిటీ నివేదిక వల్ల కేవలం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్సార్‌ వంటి ప్రయివేటు కంపెనీలకు మాత్రమే లాభం జరుగుతుందని, వినియోగదారులపై మోయలేని భారం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

పెట్రోలియం ఉత్పత్తులను ఎగు మతి చేయడానికి ఏర్పాటు అయిన ఎగుమతి యూనిట్లు పెట్రోలు, డీజిల్‌ ఇండియాలోనే విక్ర యించడానికి అనుమతించి వాటికి విపరీతంగా లాభాలు వచ్చే మార్గాన్ని ఈ నివేదిక సిఫా రసులు చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తు న్నారు.

చమురు రంగంలో ఇప్పటికే ఉన్న అనేక అవకతవకలను సరిచేయకుండా పరేఖ్‌ కమిటీ సిఫారసులను ధరలను పెంచడం వరకు అమలు చేయడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న కిరో సిన్‌ తప్ప మిగిలిన పెట్రోలియం ఉత్పత్తులను దేశంలో 75 శాతం ప్రజలకు అందుబాటులో లేని స్థాయికి ఈ సిఫారసుల వల్ల చేరుతాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రజాపంపిణీ కిరోసిన్‌ కూడా తలసరి సరఫరా ఒక లీటరు కూడా లేదని వారు గణాంకాలను చూపుతు న్నారు.

కేంద్ర ప్రభుత్వం తాను పెట్రోలియం ఉత్పత్తుల మీద ప్రజలకు సబ్సిడీగా ఇస్తున్నానని చెబుతున్న మొత్తం కంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్పత్తులపై వసూలు చేస్తున్న పన్నులు చాలా అధికంగా ఉన్నాయని, ఈ అంశాన్ని పరేఖ్‌ కమిటీ లోతుగా పరిశీలించలేదని నిపుణులు పేర్కొంటున్నారు. రీటైల్‌ ధరలు అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరల ఆధారంగా నిర్ణయం కావాలని చెబుతూనే దేశీయంగా విధిస్తున్న పన్నులు, భారతీయ పౌరుల కొనుగోలు శక్తి వంటి అంశాల జోలికి కమిటీ వెళ్లకపోవడాన్ని నిపుణులు విమర్శి స్తున్నారు. పరేఖ్‌ కమిటీ నివేదికను అమలు చేస్తే చమురు, చమురు ఉత్పత్తుల ధరలు ఇండియా లోనే అత్యధికంగా ఉంటాయని, చైనాలో కూడా ఇండియాలో విధించిన్నని పన్నులు చమురు ఉత్పత్తులపై వేయడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇండియాలో ప్రస్తుతం రిఫైనింగ్‌ కెపాసిటీ బాగా విస్తరించింది. దేశీయ అవసరాల కంటే 35 శాతం అదనంగా రిఫైనింగ్‌ కెపాసిటీ ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల్లో క్రూడాయిల్‌ ధర 90 శాతంపైగా ఉంటుంది. రిఫైనింగ్‌ ద్వారా మిగిలిన పది శాతం లాభసాటిగా నడవాలి. కేంద్ర ప్రభు త్వం వివిధ రూపాల్లో ఇచ్చిన సబ్సిడీ ద్వారా రిఫైనింగ్‌ కెపాసిటీని ఏర్పాటు చేయడం సాధ్య మైంది. ఇండియా నుంచి పెట్రోలియం ఉత్ప త్తుల ఎగుమతి ఇటీవల కాలంలో భారీగా జరుగుతుంది. భారతీయ పౌరులు చెల్లించిన పన్నుల నుంచి రిఫైనింగ్‌ కంపెనీలకు సబ్సిడీలు ఇచ్చి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి అనుమతిస్తున్నారు. ప్రభుత్వరంగ, ప్రయివేటు రిఫైనరీల మీద పన్ను విధించే అంశాన్ని పరేఖ్‌ కమిటీ పరిశీలించకపోవడాన్ని నిపుణులు తప్పుపడుతున్నారు.

ఓఎన్‌జిసిన చూసిన దృష్టితోనే ఇతర కంపెనీలను కూడాచూడాలన్నది వారి అభిప్రాయం. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు మాత్రమే వంట గ్యాస్‌ సబ్సిడీని పరిమితం చేయాలన్న అభిప్రాయాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. నిజానికి దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలలో వంటగ్యాస్‌ వినియోగం తక్కువగా ఉన్నదని, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు సబ్సిడీ అవసరం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఎంత మంది సంపన్నులు ఉన్నారన్నది వారి ప్రశ్న. రైతులకు మద్దతు ధర పెంచడం ద్వారా డీజిల్‌ ధరల పెరుగుదలను భర్తీ చేయాలని, పరేఖ్‌ కమిటీ పేర్కొనడాన్ని కూడా వారు తప్పుపట్టారు.

దేశంలోని చిన్నసన్నకారు రైతుల్లోని చాలా మంది జీవించడం కోసమే వ్యవసాయం చేస్తున్నారని, వారు మర్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయించరని, వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కిరోసిన్‌ వినియోగాన్ని తగ్గించ డానికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఇళ్లకు  విద్యుత్‌ సరఫరా చేయాలని పరేఖ్‌ కమిటీ సూచించింది. అయితే దేశంలోని 50 శాతం ప్రజలకు ఇంకా విద్యుత్‌ అందుబాటులో లేదని, అప్పటి వరకు సబ్సిడీలను కొనసాగించక తప్పదని నిపుణుల అభిప్రాయం.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 కావేరి బేసిన్‌లో గ్యాస్‌ నిల్వలు
 ముగిసిన విమానాల పండుగ
 ఉత్పత్తి పెంచిన టాటా స్టీల్‌
 సిరియాలో క్రూడ్‌ నిల్వలు
 కొబ్బరికాయలు అమ్ముకోవడం మంచిదే
 కొబ్బరి చెట్లకు బీమా సౌకర్యం
 మరిన్ని ప్రైవేట్‌ బ్యాంకులు
 మెర్సిడీస్‌ బెంజ్‌ అమ్మకాలు
 బడ్జెట్‌ ప్రతిపాదనలతో కొత్త ఆదాయం
 టాటామోటార్స్‌ నికర లాభం
 
 
ముఖ్య వార్తలు
  అంతరిక్ష విజ్ఞానంలోనూ సగం
  రెండు రాష్ట్రాలుగా తెలంగాణ, సీమాంధ్ర
  లారీ, ఆటో ఢీకొని 12మంది మృతి
  భారత పాస్‌పోర్టు అప్పగించిన ..
  సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
  ఇంటి ముఖం పట్టిన మైఖెల్‌ క్లార్కె
  పెరిగిన కార్ల అమ్మకాలు
  ఎస్‌బిఐ చట్టం సవరణకు బిల్లు
  82వ ఆస్కార్‌ అవార్డులు
  ముమైత్‌ఖాన్‌ ఎల్‌ బోర్డ్‌
రాజకీయ జేఏసీ నుంచి వైదొలగుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా...?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com