మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
తాలిబన్లను తలపిస్తున్నారు
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:14 [IST]

samuyalఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు, ఫిబ్రవరి 8, ప్రభాతవార్త: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థి తుల్లో వేర్పాటువాద నాయకుల చర్యలు తాలిబ న్లనుతలపిస్తున్నాయని సమైక్యాంధ్రజెఎసి నాయ కులు ఆరోపించారు. హైదరాబాద్‌లో మరో ఆస్ట్రే లియా తరహా దాడులకు పాల్పడతామని, అమా యకవిద్యార్ధులనురెచ్చగొడుతున్నవేర్పాటు నాయ కుల ధోరణికి తగిన చర్యలతో ప్రభుత్వం  కట్టడి వేయాలని జెసి కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.శామ్యూల్‌, గౌరవాధ్యక్షుడు పి. నరసిం హారావువిజ్ఞప్తిచేశారు.

సోమ వారం వర్సిటీలో విలేకరు లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసిన  శ్రీకృష్ణ సంప్రదింపుల  కమిటీ  పరిధిలో దేశం లోని అనేక రాష్ట్రాలలో జరుగుతున్న వేర్పాటు వాద  పరిస్థితులను కూడా చేర్చా లని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర సమగ్రతను కోరుతూ పాదయాత్ర చేస్తున్న విద్యార్ధులకు రక్షణ కల్పించకపోగా వారిని అరెస్ట్‌ చేయ టం విచారకరమన్నారు. తక్షణంవారికి ప్రభుత్వం రక్షణ కల్పించి రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగి వారి భావ ప్రకటన స్వేచ్ఛను వెలిబుచ్చే అవ కాశాన్ని కల్పించాలని కోరారు.
రాహుల్‌గాంధీ మహారాష్ట్ర పర్యటనను శివసేన వ్యతిరేకించినప్పటికీ ఆయనకు తగిన భద్రతను కల్పించిన ప్రభుత్వం,ఆంధ్రప్రదేశ్‌లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఏ పౌరుడికైనా ప్రాథమిక హక్కుగా ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉందని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులను అరెస్ట్‌ చేయటంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్‌లోని కాకతీయ వర్సిటీలో జరిగిన తెలంగాణ విద్యార్ధి జెఏసి సభలో సీమాంధ్ర ప్రజలపై చేసిన వ్యతిరేక తీర్మానాలపై ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసునన్నారు.
సమైక్య రాష్ట్రంలోని ప్రజలపై వేరొక ప్రాంత విద్యార్ధులతో ఉద్రేకపూ రితమైన ప్రకటనలు ఇప్పించి ఉద్రిక్తతలు సృష్టించటం సమంజసం కాదన్నారు. దేశం ఆర్థికంగా సుసంపన్నం కావాలంటే అంతర్గత భద్రత ముఖ్యమన్నారు.


దేశ సమగ్రతకు ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహా త్మాగాంధీ మార్గమైన అహింసను ఆయుధంగా రాష్ట్ర సమైక్యత కోసం విద్యార్ధులు,సీమాంధ్ర ప్రజలు నిరంతరం శాంతియుత పోరాటం చేస్తా రని వారు తెలిపారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com