| భారత పర్యటనకు 5 ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:59 [IST] |
 |
|
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి ల్లో తక్కువ ఓవర్ల సిరీస్‌ను ఆడేందుకు ఇంగ్లండ్ మహిళా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ప్రపం చ చాంపియన్లు, ప్రపంచ ట్వంటీ 20 ఛాంపియన్లు అయిదు వన్డేలు, మూడు ట్వంటీ 20 మ్యాచ్‌లను ఆడతారని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. బెంగళూర్‌లో ఫిబ్రవరి 17న బోర్డ్ ప్రెసిడెంట్ 11తో వార్మ్ అప్ మ్యాచ్‌తో పర్యటన ప్రారంభమవ్ఞ తుంది.
అదే నగరంలో మొదటి రెండు వన్డేలు ఫిబ్రవరి 19, 21 తేదీల్లో జరుగుతాయి. తరువాతి 2 మ్యాచ్‌లు ఫిబ్రవరి 24, 26 తేదీల్లో విశాఖ పట్నంలోను, చివరి వన్డే ముంబయిలోన ఎంఐజి స్టేడియంలోను ఆడతారు. మళ్లీ ముంబయిలోనే మొదటి ట్వంటీ20 మ్యాచ్‌ను డివై పాటిల్ స్టేడి యంలోను, మిగిలిన రెండు మ్యాచ్‌లను బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోను ఆతిథ్యం ఇస్తారు.
మొదట హైదరాబాద్‌లో రెండు వన్డేలు ఆడాలని అనుకు న్నప్పటికీ, స్థానికంగా రాజకీయ పరిస్థితి వేడెక్కి ఉండడంతో బెంగళూరు, ముంబయిలకు మార్చా రు. ఇంగ్లండ్‌లో 2008 ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ జట్లు ఆడిన అయిదు వన్డే సిరీస్‌ను 4-0 స్కోరుతో భారత్ కైవసం చేసుకుంది.
|
|
|
|
|
|
|