| ఎటిపి ర్యాంకింగ్‌లో మెరుగుపడ్డ సోమ్‌దేవ్, బోపన్న |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:54 [IST] |
 |
|
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : తాజాగా సోమవారం విడుదల చేసిన ఎటిపి ర్యాంకింగ్‌లో సోమ్‌దేవ్ దేవ్వార్మన్ 21 స్థానాలు ముందుకు దాటి సింగిల్స్‌లో 141వ స్థానానికి చేరగా, దక్షిణాసియా ఓపెన్‌లోని ఎటిపి డబుల్స్ టైటిల్ సాధించిన రోహన్ బోపన్న 19 స్థా నాలు ముందుకు జరిగి 69లో చేరాడు.
జొహన్నెస్ బర్గ్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో డేవిడ్ ఫెర్రెర్‌తో సోమ్‌దేవ్ ఓడిపోవడానికి ముందు సీజన్డ్ క్సావి యెర్ మాలిస్సెను ఓడించాడు. అదే టోర్నమెంటు లో బోపన్న, అతని భాగస్వామి ఐసమ్ ఉల్ హక్ ఖురేషీతో కలిసి కరోల్ బెక్, హరోల్డ్ లెవీలను ఓడించి డబుల్స్ టైటిల్‌ను చేజిక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా, ప్రకాష్ అమృతరాజ్ 22 స్థానాలు దిగజారి 222లో సెటిలవ్వగా, లియండర్ పేస్ (7), మహేష్ భూపతిలు వారి ర్యాంకింగ్‌ల్లో మా ర్పు లేకుండా ఉన్నారు. డబ్ల్యుటిఎ ర్యాంకింగ్‌లో సానియా మీర్జా తన సింగిల్స్, డబుల్స్ ర్యాం కింగ్‌లను వరుసగా 59, 33లు అలాగే ఉన్నాయి.
|
|
|
|
|
|
|