చెన్నై, ప్రభాతవార్త బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రష్యా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్‌తో వ చ్చే నాలుగు మాసాలలోపున కోర్పోసాట్ 2బి ఉపగ్రహాన్ని జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ను ప్రయోగిం చనున్నామని ఆ సంస్థ చేర్మన్ డాక్టర్ కె. రాధా కష్ణన్ తెలిపారు. చెన్నై సమీపం కాట్టాన్‌కు ళ త్తూరులోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం టిపి గణేశన్ ఆడిటోరింయలో సోమవారంనాడు ఆ విశ్వవిద్యాలయం అయిదో స్నాతకోత్సవం జరి గింది.
ఈ సందర్భంగా రాధాకష్ణన్‌కు గౌర వడాక్టరేట్‌ను లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలే ఖరులతో మాట్లాడుతూ చంద్రాయణ్ ప్రయోగం విజయవంతమైందని, ఆ ప్రయోగం ద్వారా లభించిన ఆధారాలను ఇంకా పరిశీలిస్తున్నామని చెప్పారు. చంద్రుడిపై నీటి నిల్వలు ఉన్నాయని ఆ ప్రయోగం ద్వారా ప్రకటించిన ఘనత భార తదేశానికే దక్కుతుందని ఆయన తెలిపారు.
ఇక నాలుగుమాసాలలోపున కోర్పోసాట్ 2బి ఉప గహాన్ని ప్రయోగించటం ద్వారా అంతరిక్ష పరి శోధనలతోపాటు, సామాజిక, వ్యవసాయ రంగా నికి తగు సూచనలను అందించటానికి వీలవు తుందని అన్నారు. ఇప్పటివరకు రష్యా సాంకేతిక పరిజ్ఞానంతోనే క్రయోజెనిక్ ఇంజన్‌లను ఉప గ్రహాల ప్రయోగాలను నిర్వహిస్తూ వచ్చామ నీ, ప్రస్తుతం స్వదేశీ శాస్త్రవేత్తల సాంకేతిక పరిజ్ఞానంతో పిఎస్‌ఎల్‌వి రాకెట్లను ప్రయోగించను న్నామని చెప్పారు.
ఇటీవల స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్లు సక్రమంగా పనిచేయలేకపోయినప్పటికీ, వాటికి ఇస్రో శాస్త్రవేత్తలు పలు మార్పులు చేశా రని అన్నారు. ప్రస్తుతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోరూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్లు సక్రమంగా పనిచేస్తాయని తాము నిర్ధారణకు వచ్చామని చెప్పారు.