కొల్‌కతా,ఫిబ్రవరి 8 : నిత్యావసర వస్తువుల ధర లతో పాటు త్వరలో చక్కెర ధరను అదుపు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.క్రమంతప్పకుండా ధరల పరిస్థితిని సమీక్షిస్తామని హమీ ఇచ్చిం ది. ఆహార ద్రవ్యోల్బణం 17 శాతానికి మించడంతో ప్రభుత్వం ధరల అదుపునకు ప్రయత్నాలు ప్రా రంభించింది. ధరల పెరుగుదలను అరికట్టడానికి ప్రక్రియ కొనసాగుతున్నది.
త్వరలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయని ఆశి స్తున్నానని ఇక్కడి ఆసియాటిక్ సోసైటీలో ఇం దిరా గాంధీ బంగారు పతకాన్న్ది స్వీకరించిన తరు వాత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు డిమాండ్,సరఫరాల మధ్య సమతుల్యత లేదనే అంశాన్ని కేంద్రం గమనించినట్లు ఆయన చె ప్పారు. దీన్ని అలుసుగా తీసుకొని కొందరు ప్రయోజనం పొందుతున్నారని ఆయన అన్నారు.సరఫరా పెంపుదలకు ప్రభుత్వం చర్య లు మొదలుపెట్టిందని ఆయన తెలిపారు. డి మాండ్,సరఫరాల మధ్య ఉన్న అంతరం తగ్గిన ట్లు ఆయన చెప్పారు.
ధరల పరిస్థితిని సమీక్షిం చడానికి కమిటీవేసినట్లు ఆయన అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను పునర్వ్యవస్థీక రించడంతో పాటు ధరల పెరుగదలను అరికట్టడానికి వివిధ మార్గాలను సూచించడానికి ప్రణా ళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, వ్యవసాయ శాఖమంత్రి శరద్ పవార్,ఆర్థిక మంత్రితో పాటు పది మంది ము ఖ్యమంత్రులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు శనివారం కేంద్రం ప్రకటించింది.
సుంకాలను తొలగించడం,దిగుమతులను సరళతరం చేయ డం వంటి నిర్మాణాత్మక చర్యలను కేంద్రం తీసు కొంది.పిడిఎస్‌ను పూర్తిగా పునర్వ్యవస్థీ కరిం చింది.ప్రభుత్వం తీసుకొన్న చర్యల మూలంగా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుం దని ప్రణబ్ అన్నారు.గత సంవత్సరం ద్రవ్యో ల్బణం ప్రాతిప దికగా ఉన్న టోకు ధరలు డిసెం బర్‌లో7 శా తాన్ని దాటాయి.ఇవి మార్చినాటికి 8.5శాతానికి చేరుకొంటాయని అంచనా వేశారు.