మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 7:54 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
'అదుర్స్‌ను బహిష్కరిస్తున్నాం
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:01 [IST]

adursహైదరాబాద్‌,  ఫిబ్రవరి 8,  ప్రభాతవార్త  : సినిమా నిర్మాత, ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ 'అదుర్స్‌ సినిమాను తెలం గాణలో బహిష్కరిస్తున్నట్లు జెఎసి కన్వీనర్‌ ప్రొఫె సర్‌ ఎం.కోదండరామ్‌ ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సినిమాను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలు పునిచ్చారు.  నానికి  వ్యతిరేకంగా ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలని కోరారు.

నాని వ్యాఖ్యలు సీమాంధ్ర సంపన్నవర్గాల అహం కారానికి నిదర్శనమని ఆయనపేర్కొన్నారు. నాని పట్ల జూనియర్‌ ఎన్టీఆర్‌, సినీపరిశ్రమ తమ వైఖ రిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మానవతా విలువలు మరిచి తెలంగాణ ఉద్యమ కారులను కించపరుస్తూ, ఆత్మబలిదానాలు చేసిన విద్యార్థులను అవమానిస్తూ నా చేసిన వ్యాఖ్యలు దురహంకారానికి పరాకాష్ట అనిఆయన అన్నారు.

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, జూని యర్‌ ఎన్టీఆర్‌తోసహా ఆయనఅభిమానుల విజ్ఞప్తి మేరకు అదుర్స్‌ సినిమాను అడ్డుకోవద్దని, ప్రాం తాల మధ్య సఖ్యతను పాటించేందుకు తాము ఓపికతో, సహనంతో ఉండగా దాన్ని అలుసుగా, బలహీనంగా తీసుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కళ్లు తెరిస్తే ఏమవుతుందో అర్థం చేసుకోవాలన్నారు.

శాంతియుతంగా ఉద్య మాలు చేస్తున్న తమపట్ల రెచ్చగొట్టేవిధంగా వ్యవ హరించడం తగదన్నారు. సీమాం ధ్రకు చెందిన అనేక వ్యాపారాలు ఇక్కడ ఉన్న విషయాన్ని మరువన్నారు. నాని లాంటి వ్యక్తులను పెంచిపోషిస్తున్న వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.అదుర్స్‌ సినిమా నష్టాలను ఇన్సూరెన్స్‌ద్వారా రాబట్టుకునేందుకు ఆ చిత్ర నిర్మాత అయిన నాని కుట్రపన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఇన్సూరెన్స్‌ సంస్థలు తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని కోదండరామ్‌ కోరారు.

సీమాంధ్ర,తెలంగాణ ప్రాంతాల మధ్య సఖ్యత ఉండాలని తాము శాంతంగా ఉంటే తీవ్ర పదజాలాలతో అవ  మానిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలను బలిదా నం చేసిన విద్యార్థులు, యువకుల పట్ల కనీస మానవతా విలువలుకూడా పాటించకుండా ఆత్మక్షోభించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రాణత్యాగాలు చేసిన ప్రతిఒక్కరూవేగుచుక్కలని,త్యాగానికి ప్రతిరూపమని  కొనియాడారు. నాని వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణపై నాన్చుడు ధోరణి తగదు
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిని ప్రదర్శించడం తగదని కోదండరామ్‌ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు వెల్లడయ్యాక స్పంది స్తామన్నారు. విధివిధానాల విషయంలో జాప్యం చేయకుండా తక్షణమే నిర్ణ యాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర నిర్ణయాన్ని బట్టి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. జెఎసిని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వరంగల్‌ పొలికేకలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. సమయం తక్కువ ఉండటం, మాట్లాడే వక్తలు ఎక్కువ కావడం వల్ల సమ  స్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ విలేకరుల సమావేశంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సి.విఠల్‌, పిట్టల రవీందర్‌, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆకుల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 తెలంగాణ ద్రోహి టిఆర్‌సిసిసి: ..
 .ఎలుగుబంటి దాడి: ఒకరి మృతి
 'చేనేతకు చల్లని కబురు
 ఉపఎన్నికల్లో పోటీచేయకపోవడమే మేలు ..
 ఫ్రీ జోన్‌పై ధనాధన్‌ అట్టుడికిన..
 వైఎస్‌ ప్రజాహిత పథకాలను..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com